- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఊ అంటావా' సాంగ్ మిస్ చేసుకున్న హాట్ హీరోయిన్ ?
ఊ అంటావా మావ పాటలో సమంత ( Samantha )... టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట

దిశ, వెబ్ డెస్క్ : ఊ అంటావా మావ పాటలో సమంత ( Samantha )... టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట అందరి నోట్లో మెదులుతూ ఉంటుంది. అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప ( Pushpa ) మొదటి పార్ట్ లో ఐటెం సాంగ్ గా ఈ పాటను తెరకెక్కించారు. అయితే అప్పుడే విడాకులు తీసుకున్న హీరోయిన్ సమంతను ఈ పాట కోసం సెలెక్ట్ చేశారు. అయితే మొదటగా హీరోయిన్ సమంత కాకుండా కేతికను ( Ketika Sharma) ఈ పాట కోసం అనుకున్నారట.
కానీ చివరకు హీరోయిన్ సమంతాను ఫైనల్ చేసిందట మైత్రి మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) బృందం. ఈ విషయాన్ని తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల వెల్లడించారు. వెంకీ కుడుముల ( Venky Kudumula ) దర్శకత్వంలో హీరో నితిన్ కాంబినేషన్లో రాబిన్ హుడ్ ( Robin hood) సినిమా వస్తోంది. ఇందులో హీరోయిన్ శ్రీ లీల ( Sree leela) అన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. ఈ ఐటెం సాంగ్ లో కేతిక శర్మ... చిందులు వేసింది. అయితే... ఈ ఐటెం సాంగ్ లో కేతికను కూడా మైత్రి మూవీ మేకర్స్ ( Mythri Movie Makers) బృందమే సూచించిందట. అందుకే కేతికను తీసుకున్నట్లు దర్శకుడు వెంకీ కుడుముల ( Venky Kudumula ) ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.






