- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కేసరి వీర్’ సినిమా విడుదల వాయిదా.. చివరి నిమిషంలో కీలక ప్రకటన విడుదల చేసిన నటుడు
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి(Suniel Shetty), ప్రిన్స్ ధిమాన్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కేసరి వీర్’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి(Suniel Shetty), ప్రిన్స్ ధిమాన్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కేసరి వీర్’. సూపర్ పంచోలి, వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi), ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని చౌహాన్ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే 14వ శతాబ్దంలో అక్రమణదారులు నుంచి సోమ్‌నాథ్ ఆలయాన్ని రక్షించిన యోధుల ధైర్యసాహసాలను వెలుగులోకి తీసుకురానున్నట్లు సమాచారం. తుగ్లక్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్య యోధుడు హమీర్జీ గోహిల్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న టు టాక్. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా మే 16న థియేటర్స్‌లోకి రానుంది.
ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. అయితే ఇప్పటికే ‘కేసరి వీర్’ నుంచి వచ్చిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుంది అని ఎదురుచూస్తు్న్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సునీల్ శెట్టి ‘కేసరి వీర్’ విడుదలకు 10 రోజులు ఉందనగా ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుపుతూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘కేసరి వీర్’ మే 16న కాకుండా 23న థియేటర్స్‌లోకి రాబోతుందని వెల్లడించారు. దానికి కారణాలెంటో తెలియనప్పటికీ ప్రస్తుతం సునీల్ శెట్టి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.






