- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Keerthy Suresh: స్టార్ హీరో బర్త్ డే రోజు కీర్తి సురేష్ పెళ్లి.. ప్రయాణం స్టార్ట్ అయిందంటూ పోస్ట్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తటిల్(Antony Thattil)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇటీవల తాము 15 ఏళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో డిసెంబర్ 12న గోవాలో వీరిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిప పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, కీర్తి సురేష్ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
‘‘KA వెడ్డింగ్ మొదలవుతుంది.’’ అనే క్యాప్షన్ జత చేసి ప్రయాణం స్టార్ట్ అయిపోయిందంటూ గోవా ఫ్లైట్ టికెట్స్(Flight tickets) ఫొటోలను షేర్ చేసింది. కీర్తి, ఆంటోని పెళ్లి పనులు ఇప్పటికే మొదలైపోయినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే అదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) పుట్టినరోజు కావడం విశేషం. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు పలువురు సినీ స్టార్స్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని గోవాలోని చర్చీలో కీర్తి, ఆంటోనీ రింగ్స్ మార్చుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కీర్తి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More...
Keerthy Suresh: నెట్టింట వైరల్‌గా మారిన కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి ఎప్పుడంటే?






