Keerthy Suresh : ఓటీటీలోకి కీర్తి సురేష్ రెండు సినిమాలు..

by Chukka Sudharani |

టాలీవుడ్ (Tollywood) మహానటీగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ (Keerthy Suresh).. రీసెంట్‌గా ‘బేబీ జాన్’ (Baby John) మూవీతో బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Keerthy Suresh : ఓటీటీలోకి కీర్తి సురేష్ రెండు సినిమాలు..
X

దిశ, సినిమా: టాలీవుడ్ (Tollywood) మహానటీగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ (Keerthy Suresh).. రీసెంట్‌గా ‘బేబీ జాన్’ (Baby John) మూవీతో బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ (Success) అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది కీర్తి సురేష్ తెలుగు, తమిళంలో డిఫరెంట్ కాన్సెప్టులతో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. వాటిలో ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita), ‘కన్నివేది’ (Kannivedi) ఒకటి.

ఇక ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తిఅయినట్లు తెలుస్తుంది. అలాగే.. వీటి నుంచి వచ్చిన అప్‌డేట్స్ (Updates) కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగా.. త్వరలో ఇవి థియేటర్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక థియేటర్‌ (theater)లో రిలీజ్ కాకముందే ఈ సినిమాలకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ (OTT Business) కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ (Digital streaming) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుందని తెలుస్తుండగా.. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది

Next Story