Keerthy Suresh: పెళ్లైన రెండు నెలలకే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేష్.. ట్వీట్ వైరల్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి పరిచయం అక్కర్లేదు.

Keerthy Suresh: పెళ్లైన రెండు నెలలకే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేష్.. ట్వీట్ వైరల్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి పరిచయం అక్కర్లేదు. ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి నాని, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi), ప్రభాస్, మహేష్ బాబు, నితిన్ వంటి హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులో ‘మహానటి’చిత్రంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తన నటనతో అందరినీ ఫిదా చేసింది. తెలుగు, తమిళ, మలయాళ స్టార్స్ నటించిన కీర్తి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక గత ఏడాది స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) ‘బేబీ జాన్’(Baby John) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఈ క్రమంలోనే.. కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌ను పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 12న వీరిద్దరు గోవాలో ఒక్కటయ్యారు. అయినప్పటికీ కీర్తి సురేష్ భర్తతో హనీమూన్‌ను వెళ్లి ఎంజాయ్ చేయకుండా పసుపు తాడుతోనే ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో పాల్గొంది. అంత కష్టపడినప్పటికీ ఫలితం మాత్రం రాలేదనే చెప్పాలి. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. దీంతో ఈ అమ్మడు పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టి భర్తతో పలు వెకేషన్స్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఆమె ఒక సినిమాలకు దూరం అయి పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టనుందని నెట్టింట పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో అందరి హీరోయిన్స్ లాగానే కీర్తి కూడా వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతుందని అంతా టెన్షన్ పడ్డారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతూ అభిమానుల సంతోషానికి కారణమైంది. ఈ అమ్మడు కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్‌కు జంటగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఓ లవ్ స్టోరీ రాబోతున్నదట. అయితే ఆ మూవీని గుడ్ నైట్, లవర్ వంటి సక్సెస్ సినిమాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో.. అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. కీర్తి ఇండస్ట్రీకి మొత్తానికే దూరం అవుతుంది అనుకుంటే పెళ్లైన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిందని అంతా అనుకుంటున్నారు.

Next Story