- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లమ్మకు ఇన్ని కష్టాలా.. చివరికి కీర్తి సరేష్ కూడా!
బలగం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వేణు యెల్దండి. మొదటి నుండి కమిడియన్ గా నవ్వించిన వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అందర్నీ ఏడిపించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తరవాత వేణు తరవాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: బలగం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వేణు యెల్దండి. మొదటి నుండి కమిడియన్ గా నవ్వించిన వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అందర్నీ ఏడిపించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తరవాత వేణు తరవాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత దిల్ రాజు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే టైటిల్ తో వేణు తన నెక్స్ట్ సినిమాను కూడా ప్రకటించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అడుగడుగునా అడ్డంకులే వస్తున్నాయి. ప్రాజెక్టు మొదలవ్వకుండానే ఎన్నో కష్టాలు వస్తున్నాయి. సినిమాలో నటిస్తున్నారు అంటూ తెరపైకి అనేక పేర్లు వస్తున్నా వాళ్లంతా అనేక కారణాలతో ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నారు.
ఈ సినిమాలో నాని హీరోగా నటించబోతున్నాడు అంటూ మొదట ప్రచారం మొదలైంది. తరవాత నాని నో చెప్పాడన్న వార్తలు వచ్చాయి. తరవాత శర్వానంద్, దేవీ శ్రీ ప్రసాద్ పేర్లు కూడా వినిపించాయి కానీ వాళ్లు కూడా కన్ఫామ్ అవ్వలేదు. చివరగా నితిన్ పేరు వినిపించగా వరుస ఫ్లాప్ ల కారణంగా తప్పించారు అనే ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది అంటూ ఇంతకాలం ప్రచారం జరగ్గా తాను నటించట్లేదు అంటూ ఓ సినిమా ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చేసింది. దీంతో అసలు ఈ సినిమాలో ఎవరు నటిస్తారు.. ఎల్లమ్మ ఇంకెప్పుడు మొదలవుతుంది అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది.






