- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revolver Rita Trailer: దుమ్ములేపుతున్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్
Revolver Rita Trailer ట్రైలర్ ( Revolver Rita Trailer ) కూడా లాంచ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ ఓ మధ్య తరగతి అమ్మాయిగా

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న కీర్తి సురేష్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. మహానటి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కీర్తి సురేష్ ( Keerthy Suresh), ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి దుమ్ము లేపుతోంది. అయితే ఇప్పుడు రివాల్వర్ రీటా ( Revolver Rita ) అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను కేకే చంద్రు గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ రివాల్వర్ రీటా సినిమాలో రాధిక శరత్ కుమార్, అజయ్ ఘోష్, సునీల్ లాంటి కీలక నటీనటులు మెరుగనున్నారు.
ఈ సినిమా నవంబర్ 28వ తేదీన తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ( Revolver Rita Trailer ) కూడా లాంచ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ ఓ మధ్య తరగతి అమ్మాయిగా కనిపించారు. కొన్ని అనివార్య పరిస్థితులలో తుపాకీ పట్టుకొని, పెను సవాళ్లను ఎదుర్కొంటారు. అలా కీర్తి సురేష్ ఎదుర్కొనే సమస్యలు చుట్టే ఈ కథ నడుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తే మనకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ నేపథ్యంలో సినిమా ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.






