28 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేసిన టాలీవుడ్ హీరోయిన్

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మహానటిగా

28 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ( Keerthy Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మహానటిగా కీర్తి సురేష్ కొనసాగుతున్నారు. మహానటి, దసరా లాంటి సినిమాలు చేసి మంచి మార్కులు కొట్టేశారు. తెలుగు ఒక్కటే కాకుండా హిందీ ఇటు తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమె సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే... తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కీలక ప్రకటన చేశారు. 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తయిందని... ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు కీర్తి సురేష్. హీరోయిన్ కీర్తి సురేష్ అలాగే సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందిన కొత్త చిత్రం ఉప్పు కప్పురంబు (Uppu Kappurambu). ఈ సినిమా షూటింగ్ 28 రోజుల్లోనే.. ఫినిష్ చేసినట్లు తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ వెల్లడించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె ఫుల్ బిజీ అయ్యారు. ఇది ఇలా ఉండగా తాను చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని అనుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే పెళ్లి తర్వాత జీవితం అద్భుతంగా వెల్లడించారు. కాగా కీర్తి సురేష్ నటించిన ఉప్పుకప్పురంబు సినిమా జులై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం,కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Next Story