ఫ్యామిలీతో కీర్తి సురేష్ పొంగల్ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-16 02:59:47  IST  )

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఫ్యామిలీతో కీర్తి సురేష్ పొంగల్ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నిన్న కీర్తి సురేశ్ తన ఫ్యామిలీతో పొంగల్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మీరు మీ 'స్వీట్ హోమ్'లో ఉన్నప్పుడు, పొంగల్ సక్కరై పొంగల్ లాగా తియ్యగా ఉంటుంది.

మీ అందరికీ చాలా సంతోషకరమైన మరియు సంపన్నమైన పొంగల్, మకర సంక్రాంతి మరియు లోహ్రీ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది. అలాగే తన ఫ్యామిలీతో తీసుకున్న, అరటి ఆకులో భోజనం చేస్తున్న, తన భర్తతో, కుక్క మీద తల వాల్చి పడుకున్న కొన్ని క్యూట్ ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

పెళ్లి అయిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్


Next Story