- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఒక్క వ్యాయామం చేస్తూ 9కేజీలు తగ్గిన కీర్తిసురేష్.డైట్ కూడా అక్కర్లేదట
హీరోయిన్ కీర్తి సురేష్ 2019లో తాను ఏకంగా 9 కేజీలు తగ్గానని చెప్పారు. ఎలాంటి డైట్, బరువు తగ్గే టాబ్లెట్స్ వాడలేదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బరువు పెరగటం సులభమేమో కానీ తగ్గటం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా నోటికి ప్లాస్టర్ వేసుకోవాల్సిందే. చాలా మితంగా అది కూడా కేలరీలు లెక్క పెట్టుకుని తినాలి. కానీ టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఎలాంటి డైట్ పాటించకుండా సులభంగా సన్నబడిందట. ఈ విషయాన్ని కీర్తి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2019లో తాను ఏకంగా 9 కేజీలు తగ్గానని చెప్పారు. ఎలాంటి డైట్, బరువు తగ్గే టాబ్లెట్స్ వాడలేదని అన్నారు. ఆ సమయంలో తాను చాలా బొద్దుగా ఉన్నానని చెప్పారు. కానీ ఎలాంటి డైట్ చేయకుండా కార్డియో ఎక్కువగా చేసి బరువు తగ్గినట్టు తెలిపారు.
కార్డియో చేయడం ద్వారా కండరాలు తగ్గుతాయని, కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం లేకుండానే కేవలం కార్డియో చేశానని తెలిపారు. అలా వేగంగా బరువు తగ్గినట్టు చెప్పారు. తన ముఖం బరువు తగ్గిన తరవాత చాలా చిన్నగా బొక్కల మాధిరిగా కనిపించిందన్నారు. దానికి కారణం తాను ఎక్కువగా కార్డియో చేయడమే అన్నారు. అంతకు ముందు వ్యాయామం చేయకపోవడం వల్లనే బరువు పెరిగానని అన్నారు. షూటింగ్స్ కు వెళ్లడం, తినడం, పడుకోవడం ఇలానే ప్రతిరోజు చేయడం వల్ల బరువు పెరిగినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే కార్డియో వ్యాయామం ప్రభావం చాతి, కాళ్లు, బ్యాక్ పై పడుతుంది. కార్డియో వ్యాయామం కిందికి వాకింగ్, జాగింగ్ చేయడం, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి వస్తాయి.






