- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Keerthy Suresh: బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేష్ దంపతులు.. స్టన్నింగ్ డ్యాన్స్ స్టిల్స్ వైరల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్(Keerthy Suresh) క్రేజ్ స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్(Keerthy Suresh) క్రేజ్ స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరోలైన రజనీకాంత్ (Rajinikanth), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాల్లో నటించింది. అంతేకాకుండా ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్‌లోకి కూడా అడుపెట్టింది. సినిమాల విషయం పక్కన పెడితే.. కీర్తి సురేష్ రీసెంట్‌గా ప్రియుడు ఆంటోని(Antony)తో ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వీరు హిందూ, క్రిస్టియన్ రెండు పద్దతుల్లో వివాహం చేసుకున్నారు.
కీర్తి సురేష్ వివాహం అయ్యాక చాలా రోజుల వరకు మెడలో తాళిబొట్టుతో కనిపించి నెటిజన్ల వద్ద ప్రశంసలు అందుకుంది. భర్త ఆంటోనీతో అదిరిపోయే ఫొటో షూట్లు కూడా చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కీర్తి సురేష్ అండ్ ఆంటోనీ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులు ధరించి స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చారు. అలాగే కీర్తి సురేష్ అండ్ ఆంటోనీ పంచుకున్న పోస్టులకు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ‘మేము మా హృదయాలు ఒక్కటయ్యాక డ్యాన్స్ చేశాం’’ అని డ్యాన్స్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలోని జనాల్ని ఆకట్టుకుంటున్నాయి.
- Tags
- Keerthy Suresh






