ట్రెడిషనల్ లుక్‌లో కీర్తి సురేశ్.. సూర్యుడిని క్యాచ్ చేస్తున్నా అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Gugulothu.Kavitha |

మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

ట్రెడిషనల్ లుక్‌లో కీర్తి సురేశ్.. సూర్యుడిని క్యాచ్ చేస్తున్నా అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మహానటి కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుంది. అలాగే ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకొని అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ చిన్నది అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలోఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో చీరలో చాలా అందంగా రెడీ అయింది. కట్టు బొట్టుతో ట్రెడిషనల్‌గా కనిపించింది. ఇక వీటికి సూర్యుడిని క్యాచ్ చేస్తున్నా అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధిచిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story