Keerthy Suresh: తమిళంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్ చేస్తున్న హీరోయిన్..

by Chukka Sudharani |

తాజాగా ‘ఉప్పు కప్పురంబు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేష్.

Keerthy Suresh: తమిళంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్ చేస్తున్న హీరోయిన్..
X

దిశ, సినిమా: తాజాగా ‘ఉప్పు కప్పురంబు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయనప్పటికీ తమిళంలో మాత్రం ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేది’ అనే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తాజాగా కీర్తి తమిళంలో మరో సినిమా ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓ కొత్త దర్శకుడు సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. ఇక ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారట మేకర్స్. లింక్

Next Story