- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాటకు ప్రాణం పోసిన కీరవాణి
శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీ చిదంబరం’.

దిశ, సినిమా : శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకులు. కాగా తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే బ్యూటిఫుల్ పాటను విడుదల చేశారు మేకర్స్. చందు రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యాన్ని సమాకూర్చారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘కీరవాణి గారి గాత్రంతో ఈ పాట ఎంతో గొప్పగా మారింది. సినిమా విషయానికొస్తే.. ఇదొక ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామా. పూర్తిగా కొత్తదనం నిండి ఉంటుంది. ఇందులో హీరోకి ఉన్న అసలు పేరుతో కాకుండా.. ఊరంతా చిదంబరం అని ఎందుకు పిలుస్తుంటారు? అసలు హీరో ఎప్పుడూ కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? లాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా’ అని తెలిపాడు.






