టాలీవుడ్‌లో పెను విషాదం.. ‘కేడి’ సినిమా ద‌ర్శ‌కుడు మృతి !

by velandi.Saikiran |   (  Updated:2025-12-17 08:00:47  IST  )

అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన కేడీ సినిమా దర్శకుడు కిరణ్ కుమార్ మృతి చెందారు.

టాలీవుడ్‌లో పెను విషాదం.. ‘కేడి’ సినిమా ద‌ర్శ‌కుడు మృతి !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో పెను విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన కేడీ సినిమా దర్శకుడు కిరణ్ కుమార్ మృతి చెందారు. బుధవారం ఉదయం పూట యువ దర్శకుడు కిరణ్ కుమార్ తుది శ్వాస విడిచినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో కిరణ్ కుమార్ బాధపడుతున్నారట. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మరణించారు.

ఇక కిరణ్ కుమార్ మృతి నేపథ్యంలో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా కిరణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ మూవీ "కింగ్ జాకీ క్వీన్" (KJQ) సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతలోపే ఈ పెను విషాదం చోటు చేసుకుంది. క్లిక్

Next Story