‘కేడి ది డెవిల్’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

by Pulgam srinivas |

'కేడి ది డెవిల్' చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

‘కేడి ది డెవిల్’ తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ నటుడు ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటించిన కేడి ది డెవిల్ చిత్రంలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, రీష్మా నానయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించారు. తాజాగా ఈ మూవీ బృందం తెలుగు విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ సినిమాను తెలుగులో ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రి సంస్థకు గట్టి పంపిణీ వ్యవస్థ ఉండటంతో, ఈ చిత్రానికి మంచి థియేటర్లు దొరికే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




Next Story