మయసభ వెబ్ సిరీస్‌లో కేసీఆర్ పాత్ర..ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-07 14:22:01  IST  )

మయసభ సిరీస్‌లో అచ్చం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన పాత్ర ఉండటం విశేషం. కేసీఆర్ గెటప్ లో ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు పాత్రలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి నా పేరు టీకేఆర్ సూర్యాపేట నుండి వచ్చాను. మా అబ్బాయికి మీరే పేరే పెట్టాను అని చెబుతారు.

మయసభ వెబ్ సిరీస్‌లో కేసీఆర్ పాత్ర..ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మధ్య బయోపిక్ అని చెప్పకుండా బయోపిక్‌లు తీస్తున్నారు. అలాంటి సినిమాలు,వెబ్ సీరీస్‌లు ఇదివరకు హిందీలో కనిపించేవి. తెలుగులో రామ్ గోపాల్ వర్మ సైతం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అలాంటి సినిమాలను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు అలాంటి పనే టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్ట సైతం చేశారు. వెన్నెల సినిమాతో దేవకట్ట ఇండస్ట్రికి పరిచయం అవ్వగా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక తరవాత ఆయన ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు ఆశించిన మేర విజయం సాధించలేకపోయినా విమర్శల ప్రశంసలు అందుకున్నాయి.

ఇక తాజాగా దేవకట్ట మయసభ వెబ్ సిరీస్ తెరెక్కించారు. ఈ వెబ్ సిరీస్ చంద్రబాబు, వైఎస్ఆర్ ఒకవేళ స్నేహితులు అయితే ఎలా ఉంటుంది అనే కంటెంట్ తో తెరకెక్కించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సిరీస్ విడుదల అవ్వగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సిరీస్‌లో అచ్చం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన పాత్ర ఉండటం విశేషం. కేసీఆర్ గెటప్ లో ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు పాత్రలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి నా పేరు టీకేఆర్ సూర్యాపేట నుండి వచ్చాను. మా అబ్బాయికి మీరే పేరే పెట్టాను అని చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక నిజ జీవితంలోనూ కేసీఆర్ తన కుమారుడి పేరును రామారావుగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. video

Next Story