Dilruba : కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘దిల్ రూబా’ నుంచి కేసీపీడీ సాంగ్ రిలీజ్ ..!

by Phanindra |   (  Updated:2025-07-31 06:58:40  IST  )

ఈ చిత్రానికి విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు

Dilruba : కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘దిల్ రూబా’ నుంచి కేసీపీడీ సాంగ్ రిలీజ్ ..!
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క మూవీతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనకి తెలిసిందే. రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో రూ. 53 కోట్లు కలెక్ట్ చేసి డబుల్ ప్రాఫిట్స్ ను తెచ్చి పెట్టింది. " క " (KA ) హిట్ తర్వాత మంచి కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని కిరణ్ అబ్బవరం డిసైడ్ అయ్యాడు.

అయితే, రీసెంట్ గా ఈ కుర్ర హీరో ‘దిల్ రూబా’ ( Dil Ruba ) చిత్రం చేశాడు. ఈ సినిమా ఇంకా ఆడియెన్స్ ముందుకు రాలేదు. ఈ చిత్రానికి విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. కిరణ్ సరసన అందాల భామ రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఏ యూడ్లీ ఫిలిం కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. సామ్ సీఎస్ మ్యూజిక్ ని అందించాడు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ మార్చి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ గ్యాప్ లేకుండా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇప్ప‌టి వరకు రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ అందర్ని అలరించాయి. మూడు పాట‌ల‌ను విడుదలవ్వగా.. తాజాగా.. నాలుగో సాంగ్ కేసీపీడీని ఈ రోజు రిలీజ్ చేశారు. అన్నా మీ పాటలు చాలా బాగుంటాయి. ఈ సాంగ్ కూడా సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్ర‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుందని మూవీ టీమ్ తెలిపింది.

Next Story