- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్‌డే స్పెషల్.. నేను రెడీ నుంచి కావ్య థాపర్ ఫస్ట్ లుక్ రిలీజ్
గతేడాది ‘డేగ, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ కావ్య థాపర్

దిశ, సినిమా: గతేడాది ‘డేగ, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) అనుకున్న రేంజ్‌లో హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘నేను రెడీ’ (Nenu Ready) అనే సినిమా చేస్తుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హవీష్ హీరోగా నటిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో రాబోతున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, అజయ్, హరి తేజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ‘నేను రెడీ’ సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత టైటిల్ గ్లింప్స్ తప్ప మరో అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ క్రమంలోనే నేడు కావ్య థాపర్ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా మూవీ నుంచి అమ్మడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.






