బుగ్గ‌పై ముద్దు పెట్టిన టాలీవుడ్ హీరో భార్య‌..వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కావ్య రెడ్డి కొండంత ప్రేమను చూపిస్తున్నారు.

బుగ్గ‌పై ముద్దు పెట్టిన టాలీవుడ్ హీరో భార్య‌..వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం లేటెస్ట్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా ఈ జంట పెళ్లి చేసుకుంది. తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ సమీపంలో రాత్రి 11 గంటల సమయంలో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. మే 1వ తేదీన రిసెప్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ క్రమంలో సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

భర్తకు కిస్ ఇచ్చిన కావ్య రెడ్డి

వేలు పట్టి ఏడడుగులు వేసిన త‌న భర్త బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై కావ్య రెడ్డి కొండంత ప్రేమను చూపిస్తున్నారు. వివాహ రిసెప్షన్ కార్యక్రమం నేపథ్యంలో తన భర్త బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బుగ్గపై కొన్ని క్షణాలపాటు కిస్ ఇచ్చారు. ఆపై లిప్ స్టిక్ తుడిచిన క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ సమయంలో హీరో సాయి శ్రీనివాస్ అమితానందంతో నవ్వుతూ కనిపించడం గ‌మ‌నార్హం. అంతకు ముందు కూడా సాయి శ్రీనివాస్ కిస్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా హాట్ టాపిక్ అయింది.

Next Story