Kattalan First Look: “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్

by velandi.Saikiran |

యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయింది. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ ని

Kattalan First Look: “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయింది. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోగా ఆంటోనీ వర్గీస్ పెపే మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. మంటల చుట్టూ సిగరెట్ తో కళ్ళలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ సీన్స్ ను తలపిస్తున్నాయి. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో తర్వాత “కాటాలన్” క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, షరీఫ్ మహమ్మద్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రూపొందుతోంది. దర్శకుడు పాల్ జార్జ్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్. రాశారు. “కాటాలన్” మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.




Next Story