కాలం ఎప్పుడు ఎవరికోసం ఆగదు.. వైరల్‌గా కత్రినా కైఫ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-05-12 15:01:31  IST  )

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) ‘మల్లీశ్వరి’ (Mallishwari) సినిమాతో తెలుగు తెరకు పరచయమైంది.

కాలం ఎప్పుడు ఎవరికోసం ఆగదు.. వైరల్‌గా కత్రినా కైఫ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) ‘మల్లీశ్వరి’ (Mallishwari) సినిమాతో తెలుగు తెరకు పరచయమైంది. తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2021లో బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్‌(Vicky Kaushal)ను పెళ్లి చేసుకుంది. వయసులో తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్‌తో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన కత్రిన.. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే.. మధ్య మధ్యలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా కైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.

‘టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు.. అలాగే ఎక్కడ ఆగిపోదు. వెళ్తూనే ఉంటుంది. ఇక కాలంతో పాటు పరిణామాలు కూడా ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నిటినీ తట్టుకోగలగాలి. మనం చేయాల్సింది అదే. నన్ను నేను రివైండ్ చేసుకున్నప్పుడు.. ఒక 21 ఏళ్ల అమ్మాయిగా.. కలర్ ఫుల్ పొట్టి మినీస్కర్ట్‌లో నటిస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ అది గుర్తుకువస్తే చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని అనుకోకూడదు. ఎందుకంటే.. చాలా మంది కొత్త నటులు ఉన్నారు. అలాగే కొత్త నటులు అనేవారు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటారు.. కాలానుగుణంగా అన్నీ అలా జరుగుతూ ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story