- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకటేష్ కోసం ఆ హీరోయిన్ చాలా కష్టపడింది.. విజయ్ భాస్కర్..!
విజయ్ భాస్కర్: నువ్వు నాకు నచ్చావ్ తర్వాత వెంకటేష్‌తో మల్లీశ్వరి సినిమా చేయాలనుకున్నాను. అందులో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దానితో అనేకమందిని హీరోయిన్లుగా అనుకొని చివరకు కత్రినా కైఫ్‌ను ఓకే చేసుకున్నాను. ఆమె కాస్త ఇబ్బందిగానే సినిమాకు ఒప్పుకుంది. ఆ తర్వాత షూటింగ్ విషయంలో కూడా కాస్త ఇబ్బంది పడింది. కానీ ఆ తర్వాత సినిమాకు ఎంతగానో సహకరించింది.

దిశ, వెబ్ డిస్క్ : విక్టరీ వెంకటేష్ చాలా సంవత్సరాల క్రితం మల్లీశ్వరి సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. 2004లో విడుదలైన ఈ మూవీ ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన మల్లీశ్వరిలో కత్రినా కైఫ్ ను సెలెక్ట్ చేయడానికి గల కారణాలను, ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులను వివరించారు. విజయ్ భాస్కర్ మాట్లాడుతూ... వెంకటేష్, నేను కలిసి నువ్వు నాకు నచ్చావ్ సినిమా చేశాం.
అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి మల్లేశ్వరి సినిమా చేయాలనుకున్నాం. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత మేము చేసే సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నిర్మాత సురేష్ బాబు గారు కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడకండి అని చెప్పారు. మల్లీశ్వరిలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దానితో నేను హీరోయిన్గా ఎవరు అయితే బాగుంటుందని అనేక మందిని ఆప్షన్లుగా తీసుకున్నాను. కానీ ఎవరూ నాకు పెద్దగా నచ్చలేదు. అలాంటి సమయంలో అనుకోకుండా టీవీలో ఓ యాడ్ చూశాను.
అందులో కత్రినా కైఫ్ కనిపించింది. ఆమె నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత చాలా కష్టపడితే ఆమె కాంటాక్ట్ దొరికింది. ఆమె దగ్గరకు వెళ్లి సినిమా ఆఫర్ గురించి చెప్పాను. ఆమె దానికి పెద్దగా ఆనంద పడలేదు. కానీ ఎలాగోలాగా ఒప్పించి కథను వినిపించాను. కథ విన్నాక ఆమె ఓకే చెప్పింది. ఆ తర్వాత ఆమె షూటింగ్ విషయంలో కూడా కాస్త ఇబ్బంది పడింది. ఆమెకు తెలుగు రాదు. దానితో మొదట కొన్ని రోజులు డైలాగ్స్ లేకుండా వచ్చే సన్నివేశాలను చిత్రీకరించాం. ఆ తర్వాత కత్రినా చాలా యాక్టివ్ అయ్యారు. సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఆమెతో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మొదట ఆమెతో పని కష్టం అనుకున్నాను, ఆ తర్వాత ఎంతో సులువుగా జరిగిందని విజయ్ భాస్కర్ తెలియజేశారు.






