- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొత్త విషయాల్ని పంచుకుంటుంది. తన వృత్తిపర, ఇతర విషయాల గురించి తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. కత్రినా కైఫ్ ఇటీవల కుంభమేళాలో పాల్గొని, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన విషయం తెలిసిందే.
కత్రినా కైఫ్ అండం విక్కీ కౌశల్ వివాహం చేసుకుని అన్యోన్య దంపతులుగా పేరు సంపాదించుకుంటున్నారు. ఈ జంట అప్పుడప్పుడు విదేశాలకు విహారయాత్రకు వెళ్లి సరదాగా గడుపుతారు. ఇక కత్రినా రీసెంట్‌గా ఈమె భర్తను ఓ సందర్బంలో ఊసరవెల్లి అని అనడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కానీ విక్కీ కౌశల్ అద్భుతమైన నటనను ఉద్దేశించి ఈ మాట వదిలింది. విక్కీ ఛావా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
కాగా విక్కీ కౌశల్ తెర మీద కనిపించిన ప్రతీసారి, ప్రతి షాట్, ఆయన స్క్రీన్ పైకి తీసుకొచ్చే తీవ్రత, పాత్రల్ని మార్చడంలో ఓ ఊసరవెల్లి అంటూ తన ప్రతిభను కొనియాడింది. అయితే తాజాగా కత్రినా అండ్ విక్కీ కౌశల్ ఓ ఫంక్షన్‌కు అటెండ్ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పిక్ నెట్టింట వైరల్ అవ్వగా.. కత్రినా చేతిపై రంగోళీతో ‘వీకే’ అని వేసుకుంది. దీనికి లవ్ సింబల్ కూడా జోడించింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. క్యూట్ కపుల్ అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






