- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Katrina: ‘నా ప్రియమైన స్నేహితులకు హృదయపూర్వక అభినందనలు’.. బాలీవుడ్ స్టార్ నటి
బాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. హిందీ, తెలుగు, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల్ని మెప్పించింది. అత్యంత పారితోషికం తీసుకుంటోన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ కూడా ఒకరు. ఈ అమ్మడు తెలుగులో మల్లీశ్వరి (Mallishwari) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.
కత్రినా నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే ఇచ్చారు. తర్వాత మైనే ప్యాక్ క్యూ కియా(Maine Pack Q Kia), నమస్తే లండర్ వంటి చిత్రాల్లో అవకాశం కొట్టేసింది. ఈ మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. 2009లో ఉగ్రవాదం గురించి తీసిన న్యూయార్క్ (New York) చిత్రంలో తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి కూడా నామినేషన్ అయ్యింది. అనంతరం కత్రినా కైఫ్ అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (Ajab prem ki gajab kahani), రాజ్నీతీ (Rajniti), కత్రినా నటించిన మేరే బ్రదర్ కీ దుల్హన్ (Mere brother ki dulhan) మూవీకి రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ కూడా అందుకుంది. ధూమ్ 3, ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) మూవీస్ అయితే బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టాయి.
ఇక ఈ బాలీవుడ్ నటి నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఓ వైపు వివాహబంధాన్ని, మరోవైపు వృత్తిపరంగా జీవితాలను బ్యాలన్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా జైపూర్‌లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఐఫా వేడుకలో భాగమైన ఈ నటి మిత్రులకు కంగ్రాట్స్ చెప్పుకొచ్చింది. ‘‘ఈ అద్భుతమైన మైలురాయికి నా ప్రియమైన స్నేహితులైన టిమ్మిన్స్, ఆండ్రే, సబ్బాస్ జోసెఫ్, విరాఫ్‌సర్కారి లకు హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి. ఇలాంటివి మరెన్నో అందుకోవాలని’’ ఈ హీరోయిన్ రాసుకొచ్చింది.






