- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karuunaa Bhushan: పేరుకు సీరియల్ హీరోయిన్.. గ్లామర్‌లో మాత్రం తగ్గేదేలే
కరుణ భూషణ్ తాజాగా పొట్టి, టైట్ బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి స్టైలిష్‌గా వివిధ యాంగిల్స్‌లో పోజులు ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న కరుణ భూషణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సీరియల్స్‌లో నటించిన ఈమె ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు సాగుతోంది. ఈమె 1988 జూన్ 15న హైదరాబాద్‌లో జన్మించింది.
ఈమె తండ్రి తెలుగువారు కాగా, తల్లి మరాఠీ. దాంతో ఈ బ్యూటీ చిన్న వయసులో కొన్ని సంవత్సరాల పాటు మహారాష్ట్రలో గడిపింది. దీంతో ఈమెకు తెలుగు కంటే మరాఠీ భాషపై ఎక్కువ పట్టు ఏర్పడింది. ఆ తర్వాత పెద్దయ్యాక హైదరాబాద్‌లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. బాలనటిగా ఈమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది.
సినిమాల్లో బాలనటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ, సీరియల్స్ ద్వారానే మంచి గుర్తింపును సంపాదించుకుంది. 2007లో యువ సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ నటి, ఆ తర్వాత అనేక సంవత్సరాల పాటు వరుస సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ప్రస్తుతం ఈమె సీరియల్స్, సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె సూపర్ హాట్ లుక్‌లో పొట్టి, టైట్ బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి స్టైలిష్‌గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఇందులో ఈమె తన హెయిర్‌ను ఎంతో స్టైలిష్‌గా ముందుకు, వెనక్కు వేసుకొని వివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో కరుణ భూషణ్ ఎంతో యాక్టివ్‌గా, ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






