సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కరుప్పు’.. పర్ఫెక్ట్ రన్ టైమ్‌తో రానుంది

by Pulgam srinivas |

కరుప్పు చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాలు 47 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కరుప్పు’.. పర్ఫెక్ట్ రన్ టైమ్‌తో రానుంది
X

దిశ, వెబ్ డెస్క్: తన వైవిధ్యమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. మే 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పనులను చకచకా పూర్తి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను మూవీ యూనిట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2 గంటల 30 నిమిషాలు 47 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సూర్య నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. మరి ఈ సినిమాతో సూర్య మంచి విజయాన్ని అందుకుంటాడని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.

Next Story