- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుక్ మై షోలో కరుప్పు హవా.. 24 గంటల్లో సెన్సేషన్
మొత్తంగా లాస్ట్ 24 గంటల్లో ఈ చిత్రానికి తమిళ్, తెలుగు వెర్షన్‌లలో కలిపి 691.04k టికెట్లు బుక్ మై షోలో అమ్ముడయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: సూర్య తాజాగా కరుప్పు చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. ఈ మూవీని మొదట మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఒక రోజు వాయిదా పడి, మే 15న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలి రోజే ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో తమిళ్, తెలుగు రెండు వెర్షన్‌లలోనూ మంచి కలెక్షన్లు వస్తున్నట్లు సమాచారం.
ఇక నిన్న శనివారం కావడంతో ఈ సినిమాకు బుక్ మై షోలో మంచి బుకింగ్స్ నమోదయ్యాయి. తమిళ్ వెర్షన్ ‘కరుప్పు’కు సంబంధించిన టికెట్లు లాస్ట్ 24 గంటల్లో 591.18k అమ్ముడవగా, తెలుగు వెర్షన్ ‘వీరభద్రుడు’కు సంబంధించిన 99.86k టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా చూస్తే గత 24 గంటల్లో ఈ చిత్రానికి తమిళ్, తెలుగు వెర్షన్‌లలో కలిపి 691. 04k టికెట్లు బుక్ మై షోలో అమ్ముడయ్యాయి. మొత్తంగా చుస్తే గత 24 గంటల్లో ఈ చిత్రానికి బుక్ మై షోలో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించినట్టే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






