- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
“కరుప్పు” కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఒక్క పోస్టుతో మాస్ హైప్
“ఇంకా 5 రోజులు మాత్రమే… మన రాత్తు రాసన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు” అంటూ కరుప్పు మూవీ యూనిట్ ఓ పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “కరుప్పు” పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను మే 14న తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని “వీరభద్రుడు” అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.
తాజాగా “ఇంకా 5 రోజులు మాత్రమే… మన రాత్తు రాసన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు” అంటూ ఓ పవర్‌ఫుల్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోలో కనిపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఈ వీడియోలో ఉన్న మాస్ ఎలివేషన్స్‌తో సినిమాపై ఒక్కసారిగా హైప్ మరింత పెరిగింది. ఇక మిగిలి ఉన్న నాలుగు రోజుల్లో కూడా మూవీ టీమ్ ఇదే స్థాయిలో ప్రమోషన్స్ కొనసాగిస్తే సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.






