కరుప్పు బ్లాక్‌బస్టర్.. సూర్య ఆలోచనలో పెను మార్పు

by Pulgam srinivas |

‘కరుప్పు’ భారీ విజయం తర్వాత సూర్య తనకు విజయాలు అందించిన దర్శకులతోనే మళ్లీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

కరుప్పు బ్లాక్‌బస్టర్.. సూర్య ఆలోచనలో పెను మార్పు
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో విజయాలు చాలామందిలో మార్పులను తీసుకువస్తూ ఉంటాయి. తాజాగా ‘కరుప్పు’ విజయంతో సూర్యలో కూడా పెద్ద స్థాయిలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. సూర్యకు భారీ స్థాయి కమర్షియల్ విజయం చాలా సంవత్సరాల క్రితం ‘సింగం’ సిరీస్‌తో వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ సరైన స్థాయి విజయం మాత్రం అందలేదు. తాజాగా ఆయన ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటించిన ‘కరుప్పు’ చిత్రం ఇటీవల విడుదలై 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమా విజయంతో సూర్య ఆలోచనా విధానంలో మార్పు వచ్చినట్లు తెలుస్తుంది.

‘కరుప్పు’తో విజయాన్ని అందించిన ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘జై భీమ్’ చిత్రంతో మంచి పేరు తెచ్చిన టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌కు కమిట్ అయినట్లు సమాచారం. ఇలా తనకు గతంలో విజయాలు అందించిన దర్శకులతోనే సినిమాలు చేసే దిశగా సూర్య ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

Next Story