Karthika Deepam : దీపతో మనసు విప్పి మాట్లాడిన కార్తీక్ బాబు

by Phanindra |

భర్త జీవితంలో జరిగిన విషయాలు నువ్వు తెలుసుకోవాలనుకోవడంలో అస్సలు తప్పు లేదు

Karthika Deepam : దీపతో మనసు విప్పి మాట్లాడిన కార్తీక్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

'ఒకరి వస్తువులు తీసుకోకూడదు శౌర్య.. ఇది పెద్ద తప్పు ’ అని నచ్చజెప్పి.. తాను తీసుకుంది. దాన్ని తీసుకుని చూస్తుండగా అది తనదే కదా అంటూ దీప గుర్తిస్తుంది. దీప చిన్నప్పుడు పారేసుకున్న లాకెట్ కార్తీక్ చూసి షాక్ అవుతాడు. ఏంటి ఇది అని షాక్ అవుతుంది. ఇక కొంతసేపటికి కార్తీక్ వచ్చి.. ఆ లాకెట్ వెతుకుతూ ఉండగా.. దీప ఏం తెలియనట్టు తీసుకెళ్లి.. ఆ లాకెట్ గురించి అడుగుతుంది. ‘అసలు దీన్ని ఇంతలా ఎందుకు దాస్తున్నారు ' అని కార్తీక్ బాబు అంటాడు.

‘నువ్వు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావా దీపా?’ అని కార్తీక్ అంటాడు. ‘ఆహా.. అదేం కాదు .. కార్తీక్ బాబు.. నేను నార్మల్ గా తెలుసుకోవాలని అడుగుతున్నాను.. అంతే అంతకి మించి ఏం లేదు .. ఈ లాకెట్ నీకు ఎవరిచ్చారు?’ అని దీప అడుగుతుంది. ‘ఇవ్వలేదు దీపా.. ’ అని కార్తీక్ అంటాడు కార్తీక్. అయితే, నీ దగ్గరకు ఎలా వచ్చింది అని దీప అంటుంది. ‘భర్త జీవితంలో జరిగిన విషయాలు నువ్వు తెలుసుకోవాలనుకోవడంలో అస్సలు తప్పు లేదు.. ఎందుకంటే చెప్పడం నా బాధ్యత కూడా.. నేను ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే మనసు విప్పి మాట్లాడే చనువు నువ్వు నాకు ఇవ్వలేదు దీపా’ అని కార్తీక్ అంటాడు.

Next Story