Karthi29 : కార్తీ29 లో హీరోయిన్ ఫిక్స్.. బ్యూటీఫుల్‌గా ఆకట్టుకుంటోన్న యంగ్ బ్యూటీ

by Chukka Sudharani |   (  Updated:2025-07-10 15:02:41  IST  )

తమిళ స్టార్ కార్తీ ప్రస్తుతం ‘సర్దార్’ సీక్వెల్‌తో పాటు.. మరో సూపర్ హిట్ మూవీ ‘ఖైది-2’తో బిజీగా ఉన్నాడు.

Karthi29 : కార్తీ29 లో హీరోయిన్ ఫిక్స్.. బ్యూటీఫుల్‌గా ఆకట్టుకుంటోన్న యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: తమిళ స్టార్ కార్తీ (Karthi) ప్రస్తుతం ‘సర్దార్’ సీక్వెల్‌తో పాటు.. మరో సూపర్ హిట్ మూవీ ‘ఖైది-2’తో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఈ హీరో. తన కెరీర్‌లో 29వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘మార్షల్’ (Marshal) అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈరోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయినా ఈ చిత్రానికి ‘తానక్కారన్’తో విమర్శకుల ప్రశంసలు పొందిన డైరెక్టర్ తమిజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై SR ప్రకాష్ బాబు, SR ప్రభు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్‌లో చేతులు కట్టుకుని ఉన్న కార్తీ ఆఫ్ లుక్‌ను మాత్రమే రివీల్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ పూజా కార్యక్రమాలతో కన్ఫర్మ్ చేశారు మేకర్స్. త్వరలో షూటింగ్‌కు సిద్ధం అవుతోన్న ‘మార్షల్’లో సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లింక్

Next Story