డైరెక్టర్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కార్తీ.. నువ్వు సూపర్ అన్నా అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-12 12:50:14  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) గత ఏడాది ‘సత్యం సుందరం’(Satyam Sundaram) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించాడు.

డైరెక్టర్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కార్తీ.. నువ్వు సూపర్ అన్నా అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) గత ఏడాది ‘సత్యం సుందరం’(Satyam Sundaram) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించాడు. ప్రస్తుతం కార్తీ సర్దార్-2(Sardar-2), ఖైదీ-2, వా వాతియార్ వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటున్నాడు. తాజాగా, కార్తీ ‘సత్యం సుందరం’ డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థార్ ROxx AX5L కారును ఆయనకు అందించారు. ఇకఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అని కార్తీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యం సుందరం’ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ తెలుగు, తమిళ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య నిర్మాణంలో వచ్చిన మూవీస్‌లో ఈ చిత్రం ది బెస్ట్‌గా నిలుస్తుంది. అయినప్పటికీ డైరెక్టర్‌కు గిఫ్ట్ ఇవ్వడంతో నెటిజన్లు కార్తీని మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ విషయాన్ని తెలుపుతూ డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘మహీంద్రా థార్ ఎన్నాళ్ల నుంచో కలలు కంటున్నా. ఆచరణాత్మక కారణాల వల్ల నేను 5 డోర్ల వెర్షన్ కోసం వేచి చూశాను. నాకు ప్రత్యేకంగా తెలుపు రంగులో థార్ రాక్స్ AX 5L 4x4 వేరియంట్ కావాలని ఉండేది. దాని లాంచ్ తర్వాత, నేను దానిని కోనాలని అనుకున్నా. రాజా సర్ సహాయం కోరాను. దానిని త్వరగా పొందడం సాధ్యమేనా అని చూడటానికి. అతని బిజీ షెడ్యూల్స్ మధ్య అతను నా లోతైన కోరికను చాలా తీవ్రంగా తీసుకున్నాడు. అతను తన వద్ద ఉన్న డబ్బులతో సాధ్యమయ్యేలా ప్రయత్నించాడు. మనకు వేరియంట్ వస్తే మనకు రంగు రాలేదు, మనకు రంగు వస్తే దానికి 4x4 లేదు.

ఓపిక నశించిపోయింది. ఇదంతా రాజా సార్‌కి చెప్తే సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ నిన్న సూర్య అన్న నుంచి కారు ఫొటో మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాకయ్యాను. వెంటనే రాజా సర్‌కి ఫోన్ చేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెబితే. ఆయన నవ్వి, ప్రేమ్ ఇది నీకు సూర్ సర్ ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. దీంతో నాకు మాట రాలేదు. సూర్య సర్ ఇంటికి వెళ్లి కార్తీ అన్న చేతుల మీదుగా కారు అందుకున్నాను. ఇదంతా ఇంకా కలలానే అనిపిస్తుంది. నేను దీన్ని బహుమతిలా చూడటం లేదు. నేను దీన్ని అన్నయ్యలు తమ్ముడికి నెరవేర్చిన కలలా భివిస్తున్నాను. థాంక్స్ సూర్య, కార్తీ, రాజాసర్ అందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.

Next Story