- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజికల్ లవ్ స్టొరీ రీరిలీజ్.. ఆనందంలో ఫ్యాన్స్
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బర్త్ డేలు, స్పెషల్ ఈవెంట్స్ సందర్భంగా ఇప్పటికే స్టార్ హీరోలతో పాటు.. చిన్న హీరోల సినిమాలు కూడా థియేటర్స్‌లో రీరిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో హిట్ అందుకోనప్పటికీ.. రీరిలీజ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టి సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇక సిని లవర్స్ కూడా తమ అభిమాన హీరో సినిమా రీరిలీజ్ అంటే ముందే ఉంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మ్యూజికల్ లవ్ స్టోరీ రీరిలీజ్‌కు సిద్ధం అయింది.
2010లో వచ్చి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఆవారా’ చిత్రం రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. కార్తీ, తమన్నా జంటగా నటించిన ఈ మూవీకి ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో వచ్చిన ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో సాంగ్స్ అప్పుడు, ఇప్పుడు అనే తేడా లేకుండా మ్యూజిక్ లవర్స్‌తో పాటు యూత్‌ను సైతం కట్టిపడేశాయి. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు ‘ది ఎవర్ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ ఆవారా నవంబర్ 22న తిరిగి విడుదలవుతోంది.. మ్యూజికల్ హిట్‌ను మరోసారి ఎంజాయ్ చేయండి’ అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






