Kareena Kapoor: అతను ఎంతో ఆవేశంగా కత్తితో ఆరుసార్లు పొడిచాడు.. కరీనా కపూర్ ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై గురువారం క‌త్తితో దాడి జ‌రిగిన విషయం తెలిసిందే.

Kareena Kapoor: అతను ఎంతో ఆవేశంగా కత్తితో ఆరుసార్లు పొడిచాడు.. కరీనా కపూర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై గురువారం క‌త్తితో దాడి జ‌రిగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియ‌ని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబ‌డి క‌త్తితో ఆరు సార్లు దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో న‌టుడు గాయ‌ప‌డ్డాడు. దీంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు అత‌డిని ముంబైలోని లీలావతి ఆస్పత్రి(Leelavathi Hospital)కి త‌ర‌లించారు. దాడిలో న‌టుడికి ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అత‌ను హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తాజాగా హీరో భార్య అయినటువంటి కరీనా కపూర్(Kareena Kapoor) స్టేట్‌మెంట్‌ను బాంద్రా(Bandra) పోలీసులు రికార్డు చేసుకున్నారు.

దీంతో ఆమె దాడి గురించి పలు విషయాలను తెలియజేశారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని చెప్పారు. అలాగే దాదాపు ఆరు సార్లు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే అతడు ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదని చెప్పారు. దీంతో ఈ ఘటనపై మరింత అనుమానం రేకెత్తిస్తోంది. అసలు అతను దొంగతనం చేయడానికి వచ్చాడా.. లేకపోతే పక్కా ప్లానింగ్‌తో సైఫ్ అలీఖాన్‌ను చంపడానికి వచ్చాడా అనే ప్రశ్నలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.

Next Story