- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘ఆయన్ను పెళ్లి చేసుకుంటే కెరీర్ నాశనం అవుద్దన్నారు’.. సంచలన విషయాలు వెల్లడించిన కరీనా..?

దిశ, వెబ్‌డెస్క్: ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్‌ను పెళ్లి చేసుకోవద్దని చెప్పిన వ్యక్తులను గుర్తుచేసుకుంది. నటుడు సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకుంటే తన కెరీర్ నాశనం అవుతుందని చాలా మంది అన్నారని వెల్లడించింది. ఎంతో మంది తనను పెళ్లి చేసుకోకండి.. మీ కెరీర్ ముగిసిపోతుంది అని అన్నారని కరీనా కపూర్ పేర్కొంది. ఎంతో మంది అనేకం చెప్పినప్పటికీ.. కరీనా ధైర్యం కోల్పోలేదు. సరే, నా కెరీర్ ముగిసిపోతే అలాగే జరగాలి అని గట్టిగా వారికి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.
అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా.. కరీనా వివాహం, మాతృత్వం ఆమె కెరీర్ విజయానికి తోడ్పడ్డాయి. వివాహం తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎక్కువ పనిచేశానని వెల్లడించింది. ఆమె విజయం సవాళ్లను ఎదుర్కోవడంలో తనను తాను నమ్ముకోవడంలో ఉందని ఆమె వ్యాఖ్యానించింది. తన ఆత్మవిశ్వాసం కరీనాను చిత్ర పరిశ్రమలో ఆమె నిరంతర ప్రధాన నటి హోదా వెనుక ప్రధాన అంశంగా మార్చాయి. ప్రస్తుతం కరీనా కపూర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.