సెట్‌లోనే కొట్టుకున్న హీరోయిన్లు.. అందరిముందే చెంప చెళ్లుమనిపించిన స్టార్ హీరోయిన్.. ఆయన విషయంలోనే గొడవ..

by Sujitha Rachapalli |

ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు ఇగో ఇష్యూస్‌కు ఎక్కువ ఉండేవని టాక్. ఎదుటి వ్యక్తులను చులకనగా చూడటం, కనీసం మనుషుల లాగా కూడా ట్రీట్ చేయకపోవడం.. తోటి నటులతో చీప్‌గా బిహేవ్ చేసేదంటూ చర్చించుకునేవారు. అంతెందుకు కోయాక్టర్‌ బిపాసా బసును

సెట్‌లోనే కొట్టుకున్న హీరోయిన్లు.. అందరిముందే చెంప చెళ్లుమనిపించిన స్టార్ హీరోయిన్.. ఆయన విషయంలోనే గొడవ..
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు ఇగో ఇష్యూస్‌కు ఎక్కువ ఉండేవని టాక్. ఎదుటి వ్యక్తులను చులకనగా చూడటం, కనీసం మనుషుల లాగా కూడా ట్రీట్ చేయకపోవడం.. తోటి నటులతో చీప్‌గా బిహేవ్ చేసేదంటూ చర్చించుకునేవారు. అంతెందుకు కోయాక్టర్‌ బిపాసా బసును అందరి ముందే చెంప మీద కొట్టిందని.. నల్ల పిల్లి అంటూ బాడీ షేమ్ చేసిందని టాక్. ఈ విషయం అప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపోగా.. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

2001లో అబ్బాస్ - మస్తాన్ థ్రిల్లర్ అజ్నాబీలో కరీన, బిపాసను లీడ్‌ హీరోయిన్లుగా సెలెక్ట్ చేశారు మేకర్స్. కానీ వీరిద్దరికి ముందు నుంచే పడేది కాదు. బిపాస.. కరీనకు తెలియకుండా తన హెయిర్ స్టైలిస్ట్‌ హెల్ప్ తీసుకున్నందకు రగిలిపోయింది. వెనుకా ముందు ఆలోచించకుండా బిపాస చెంప చెల్లుమనిపించింది. పొట్టు పొట్టు తిట్టింది. ఈ ఘటనతో బాధపడిపోయిన బిపాస.. బేఫిట్ రిప్లయ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇంత చైల్డిష్‌గా బిహేవ్ చేసిన కరీనతో ఇకపై నటించనని.. అది గొప్ప ఆఫర్ అయినా సరే కచ్చితంగా తప్పుకుంటానని చెప్పింది.

Next Story