- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajamouli: రాజమౌళి సినిమాలు అందుకే హిట్ అయ్యాయి.. కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టార్ నిర్మాతగా కరణ్ జోహార్(Karan Johar) ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నిర్మాతగా కరణ్ జోహార్(Karan Johar) ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే ‘కాఫీ విత్ కరణ్’(coffee with Karan) షోకు హోస్ట్‌గా వ్యవహరించి సినీ సెలబ్రిటీలను గెస్టులుగా పిలిచి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan), జాన్వీ కపూర్(Janvi Kapoor), సన్య మల్హోత్రా, రోహిత్ షరాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమాలు లాజిక్ కంటే నమ్మకం ఆధారంగా హిట్ అవుతాయి. ఇదంతా గొప్ప దర్శకుల మూవీస్‌లో తెలుస్తుంది. అయితే చాలామంది లాజిక్‌ను పట్టించుకోరు.
ఉదాహరకు రాజమౌళి చిత్రాలను తీసుకుంటే.. ఆయన సినిమాల్లో లాజిక్‌ల గురించి ప్రేక్షకులు మాట్లాడుకోరు. ఎందుకంటే.. ఆయన కథపై పూర్తి నమ్మకం ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కిస్తారు. హిట్స్ అందుకుంటారు. యానిమల్(Animal), గదర్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు ఈ ఫార్ములా వర్తిస్తుంది. ఒక వ్యక్తి హ్యాండ్ పంప్‌తో 1000 మందిని కొడుతున్నట్లు చూపించినా అది సాధ్యమా కాదా అని ఎవరూ పట్టించుకోరు. అయితే సన్నీ డియోల్ ఏదైనా చేయగలడని డైరెక్టర్ అనిల్‌శర్మ నమ్మారు కాబట్టి దాన్ని తెరపై చక్కగా చూపించారు. అది చూసిన ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేశారు. ఆ విజయం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి లాజిక్ గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి లాభం లేదు. సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే చూస్తే బెటర్’’ అని చెప్పుకొచ్చారు. ఇక కరణ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు.






