ఈ వారం థియేట‌ర్‌, OTTలో రిలీజ్ అయ్యే సినిమాలు, లిస్ట్ లో కాంత కూడా

by velandi.Saikiran |

అన్నగారు వస్తారు ( Annagaru Vostaru) అనే సినిమా కూడా ఉంది. పోలీస్ గెటప్ లో హీరో కార్తీ నటిస్తున్న అన్నగారు

ఈ వారం థియేట‌ర్‌, OTTలో రిలీజ్ అయ్యే సినిమాలు, లిస్ట్ లో కాంత కూడా
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్, ఓటీటీలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ వారం పెద్ద హీరోల సినిమాలే వస్తున్నాయి. ఇందులో అన్నగారు వస్తారు ( Annagaru Vostaru) అనే సినిమా కూడా ఉంది. పోలీస్ గెటప్ లో హీరో కార్తీ నటిస్తున్న అన్నగారు వస్తారు అనే సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ తోపాటు కామెడీ కూడా ఈ మూవీలో ఉండనుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అటు శ్రీ నందు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ ( Psych Siddhartha). ఈ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ మోగ్లీ 2025 ( Mowgli 2025). ఈ సినిమాను సందీప్ రాజ్ గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ మూవీ కూడా ఈనెల 12వ తేదీన రిలీజ్ కానుంది. అటు ఆహాలో త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ డిసెంబర్ 12వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారం ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన కాంత సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ నవంబర్ 14వ తేదీన థియేటర్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఇక డిసెంబర్ 12వ తేదీన ఓటీటీలోకి రాబోతోంది. నెట్ ఫ్లిక్స్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో దుల్క‌ర్‌ సల్మాన్ హీరోగా చేయగా భాగ్యశ్రీ హీరోయిన్ గా మెరిసిన సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి తో పాటు సముద్ర ఖ‌నీ కీలకపాత్రలో మెరిశారు. అటు సూపర్ మాన్ డిసెంబర్ 11వ తేదీన జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Next Story