‘కాంతార’ వివాదం.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌ సింగ్‌కు ఊరట

by Kema Shiva Kumar |

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ 'కాంతార' చిత్రంలోని దైవ నర్తనను అనుకరించిన వివాదంలో కర్ణాటక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

‘కాంతార’ వివాదం.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌ సింగ్‌కు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కాంతార’ (Kantara) మూవీలోని దైవ నర్తనను అనుకరించిన (Mimicry) వివాదంలో భాగంగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh)కు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక లభించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు దర్యాప్తుకు రణవీర్ సింగ్ సహకరించాలని షరతు విధిస్తూనే, ఆయనపై ప్రస్తుతానికి ఎటువంటి కఠిన చర్యలు (Coercive Action) తీసుకోవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ వర్గం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, అజ్ఞానంతో చేసినప్పటికీ అటువంటి చర్యలు సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలను దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను కోర్టు మార్చి 2కు వాయిదా వేసింది.

అసలు ఏం జరిగిందంటే..?

కాగా, గతేడాది అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికపై రణవీర్ సింగ్ ‘కాంతార’ చిత్రంలోని రిషబ్ శెట్టి (Rishabh Shetty) నటనను మెచ్చుకుంటూ, దైవ నర్తనను అనుకరించారు. అయితే, ఆ సమయంలో దైవాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని కర్ణాటకలోని తుళునాడు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రణవీర్‌ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Next Story