Rishab Shetty: ‘కాంతార చాప్టర్-1’ మూవీ వాయిదా.. స్పందించిన మూవీ మేకర్స్.. దయచేసి అలాంటివి చేయొద్దంటూ ట్వీట్

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) నటించిన ‘కాంతార’(Kantara) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Rishab Shetty: ‘కాంతార చాప్టర్-1’ మూవీ వాయిదా.. స్పందించిన మూవీ మేకర్స్.. దయచేసి అలాంటివి చేయొద్దంటూ ట్వీట్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) నటించిన ‘కాంతార’(Kantara) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ 2022లో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇక ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి స్వయం దర్వకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఒకేసారి అన్ని భాషల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ‘కాంతార: చాప్టర్-1’(Kantara: Chapter-1) షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు, అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘మేము అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాము. కాబట్టి మా ప్రణాళికలకు తగినట్లే షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 2న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాబోతుంది. దయచేసి మమ్మల్ని నమ్మండి. వేచి ఉండడం ఎంత విలువైనదో మీకే అర్థంమవుతుంది. ఈ సినిమాపై వస్తోన్న ఊహాగానాలకు దూరంగా ఉండండి. వాటిని పట్టించుకోకండి. అలాగే నెటిజన్లకు అనధికారిక ప్రటనలను షేర్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో రిషబ్ శెట్టి అభిమానులు సంతోష పడుతున్నారు.

Next Story