- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kantara Chapter 1 : కొత్త ట్రైలర్..గూస్ బంప్స్ రావాల్సిందే
కాంతార సినిమా మూడు సంవత్సరాల కిందట వచ్చి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా

దిశ, వెబ్ డెస్క్ : కాంతార సినిమా మూడు సంవత్సరాల కిందట వచ్చి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1 ) వచ్చింది. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్ని హీరో రిషబ్ శెట్టినే. ఎన్నో నిద్ర లేని రాత్రుళ్లు గడిపి, చాలా గ్రాండ్ మూవీ తీశారు. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేశారు. మొన్న దసరా కానుకగా అంటే అక్టోబర్ రెండో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు రూ. 675 కోట్లు వసూలు చేసింది.
కేవలం 125 కోట్లతో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 రూ. 675 కోట్లు రాబట్టడం గమనార్హం. అది కూడా 12 రోజుల్లోనే ఈ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా దూసుకు వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో సినిమాకు మరోసారి హైప్ తెచ్చేందుకు కొత్త ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. దీపావళి సందర్భంగా ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇందులో యాడ్ చేసి రిలీజ్ చేశారు.






