రూ.500 కోట్ల క్ల‌బ్‌లో ‘కాంతార చాఫ్ట‌ర్ 1’..ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ !

by velandi.Saikiran |   (  Updated:2025-10-10 17:50:21  IST  )

కాంతార చాప్టర్ 1 సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. మొన్న దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా 500 కోట్ల క్లబ్

రూ.500 కోట్ల క్ల‌బ్‌లో ‘కాంతార చాఫ్ట‌ర్ 1’..ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: కాంతార చాప్టర్ 1 ( Kantara Chapter 1 ) సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. మొన్న దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. నిన్న ఒక్కరోజే దాదాపు రూ. 80 కోట్ల వరకు వసూలు చేసింది అట ఈ కాంతార చాప్టర్ 1 సినిమా. ఈ సినిమాలో రిషబ్ శెట్టిది ( Rishab Shetty ) వన్ మాన్ షో అన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా రుక్మిణీ వ‌సంత్ ( Rukmini Vasanth) చేశారు.

కాంతార సినిమా సక్సెస్ కావడంతో కాంతార చాప్టర్ 1 తెర‌కెక్కించారు. దీంతో మొదటి సినిమా కంటే ఈ సినిమానే చాలా అద్భుతంగా ఉందని జనాలు ఎగబడుతున్నారు. దానికి తోడు తెలుగులో పెద్ద సినిమా థియేటర్లలో ఆడడం లేదు. ఇంకేముంది అందరూ కాంతార చాప్టర్ 1 కే వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ కంటే ఎక్కువ తెలుగులో కలెక్షన్స్ రాబడుతోందట.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 509 కోట్లు తొమ్మిది రోజుల్లోనే వసూలు చేసింది కాంతార చాప్టర్ 1. 2025 సంవత్సరంలో ఛావా 600 కోట్లతో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ సినిమాను కాంతార చాప్టర్ 1 బీట్ చేస్తుందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా దీపావ‌ళి త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తుంద‌ని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంద‌ని స‌మాచారం.

Next Story