- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"కన్నప్ప"కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్..గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయంటే?
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. సొంత బ్యానర్ పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

దిశ, వెబ్ డెస్క్: మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. సొంత బ్యానర్ పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలు కాగా భారీగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. బుక్ మై షో యాప్‌లో గంటకు 3 నుండి 5వేల మధ్య టికెట్స్ బుక్ అవుతున్నాయి. అంతే కాకుండా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే సినిమా ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మైషో మరియు డిస్ట్రిక్ యాప్‌లో రూ.70 లక్షలు వసూలు చేయడం విశేషం. హైదరాబాద్ లో ఫస్ట్ డే ఓపెనింగ్ షోలు దాదాపు 308 పడుతున్నాయి. ఇప్పటికే సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్రంలో ప్రభాస్ నటించడంతో మరింత హైప్ వచ్చింది.






