సెన్సార్ పూర్తి చేసుకున్న కన్నప్ప.. నిడివి ఎంతంటే..

by Naga Rani Yarlagadda |

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ (Kannappa Movie) విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యాచరణ పూర్తి చేసుకుంది. సెంటర్ బోర్డు నుంచి UA సర్టిఫికెట్ పొందిన కన్నప్ప సినిమా.. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న కన్నప్ప.. నిడివి ఎంతంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ (Kannappa Movie) విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యాచరణ పూర్తి చేసుకుంది. సెంటర్ బోర్డు నుంచి UA సర్టిఫికెట్ పొందిన కన్నప్ప సినిమా.. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మొదట ఈ చిత్రం 195 నిమిషాల నిడివితో రూపొందించగా.. సెన్సార్ సభ్యుల సూచనల మేరకు 12 కట్స్ చేసిన తర్వాత, చిత్ర నిడివి 182 నిమిషాలుగా (3 గంటల 2 నిమిషాలు) ఖరారైంది. తొలగించిన దృశ్యాల్లో చిన్నారి ఒక గద్దపై నుంచి పడిపోతున్న సీన్, తినుబండారాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, మూడు పాటల్లోని కొంత విజువల్ కంటెంట్ ఉన్నట్లు సమాచారం.

బుధవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్

తెలుగు వెర్షన్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారం నుంచి ప్రారంభమవనున్నట్లు మంచు విష్ణు (Manchu Vishnu) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమా కథను మంచు విష్ణే అందించడం విశేషం కాగా, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దీనిని భారీ స్థాయిలో తెరకెక్కించారు.

ఈ చిత్రంలో మంచు విష్ణు తిన్నడు అలియాస్ కన్నప్పగా నటించగా, ప్రభాస్ రుద్రుడిగా, మోహన్‌లాల్ కిరాతరూపంలో, అక్షయ్ కుమార్ పరమశివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా, మోహన్‌బాబు మహదేవ శాస్త్రిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భక్త కన్నప్ప తర్వాత మళ్లీ కన్నప్ప కథ

దాదాపు 50 సంవత్సరాల తర్వాత, 1976లో విడుదలైన కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ అనంతరం మరోసారి కన్నప్ప కథను తెరపై చూపిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ స్థాయి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచాయి. మరి ఊహించిన స్థాయిలో కన్నప్ప చిత్రం కలెక్షన్లు వసూలు చేస్తుందో లేదో.. చూడాలి.

Next Story