- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannappa : కన్నప్ప రిలీజ్ డేట్ వాయిదా.. క్షమించాలి అంటూ కొత్త విడుదల తేదీపై విష్ణు పోస్ట్
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ (Kannappa) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ (Kannappa) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సి ఉండగా.. విడుదల వాయిదా పడినట్లు తెలుపుతూ మంచు విష్ణు తన సోషల్ మీడియా (Social media) అకౌంట్ X వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులు, అండ్ సినీ ప్రేమికులు.. ‘కన్నప్ప’ సినిమా తెరకెక్కించడం మా జీవితానికి ఓ అద్భుతమైన ప్రయాణం. మేము ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము. అయితే.. ఇందులో ఓ కీలకమైన ఎపిసోడ్(episode)కు సంబంధించిన VFX పని పూర్తి చేయడానికి మాకు మరికొన్ని వారాలు సమయం కావాలి. ఈ కారణంగా ప్రాజెక్ట్ రిలీజ్ కాస్త ఆలస్యమవుతుంది. ఈ సినిమా మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఆలస్యం చేస్తున్నందుకు మేము చింతిస్తున్నాము. అలాగే ‘కన్నప్ప’పై మీకు ఉన్న అంచనాలను అర్థం చేసుకున్నాము. మీ సహనానికి, మద్దతుకు నేను నిజంగా అభినందిస్తున్నాను. కన్నప్ప పరమశివుని గొప్ప భక్తునికి నివాళి.. మేము దానిని సాధ్యమైనంత అసాధారణమైన రీతిలో ప్రదర్శించాలనుకుంటున్నాము. మా బృందం విశ్రాంతి లేకుండా క్వాలిటీ వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అలాగే కొత్త విడుదల తేదీతో త్వరలో మీ ముందుకు వస్తాము. మాతో నిలబడినందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టాడు.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025






