‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-10 16:15:01  IST  )

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa).

‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు..  ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు(Mohan Babu) 24 ఫ్రేమ్స్, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్, మంచు విష్ణు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), ప్రభాస్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, మధుబాల, అరియానా, వివియానా, అవ్రామ్, దేవరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘కన్నప్ప’ విడుదలైన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు క్యూరియాసిటీని పెంచాయి.

అయితే ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ పూర్తి కానందున వాయిదా వేస్తున్నట్లు ఇటీవల మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిరాశ చెందిన సినీ ప్రియులంతా కొత్త రిలీజ్ డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మంచు విష్ణు ‘కన్నప్ప’ రిలీజ్ తేదీ ప్రకటిస్తూ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో విడుదల పోస్టర్‌ను లాంచ్ చేయించారు. ఈ మేరకు.. నా ఫేవరెట్ హీరో యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశాను. ఆయన మా కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు రమేశ్ గొరిజాలా వేసిన పెయింటింగ్‌ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది. మన ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది.. హర హర మహాదేవ్’’ అని రాసుకొచ్చారు. అలాగే కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story