- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Power Star Pawan Kalyan: కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్లేస్-గెస్ట్ ఎవరో ఊహించలేరు..?
ఇప్పటికే కన్నప్ప (Kannappa) చిత్రం నుంచి విడుదలైన టీజర్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే కన్నప్ప (Kannappa) చిత్రం నుంచి విడుదలైన టీజర్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడే మోహన్ బాబు మనవరాళ్లు ఊహించని గెటప్‌లో దర్శనమిచ్చి.. అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కించగా.. మంచు విష్ణు నిర్మిస్తున్నారు.
ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలతో మూవీ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్(Akshay Kumar), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), మధుబాల, శరత్ కుమార్, మోహన్ బాబు (Mohan Babu) వంటి ప్రముఖ సెలబ్రిటీలు కనిపించనున్నారు. నటీనటుల పేర్లు లీక్ అయ్యాక.. అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
ఇవాళ కూడా ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచేందుకు మేకర్స్ మరో టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చే నెల (ఏప్రిల్) 25 వ తేదీన రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికన అభిమానులతో ముచ్చటించారు. ఇందులో ఓ నెటిజన్.. కన్నప్ప ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా? అని ప్రశ్నించగా.. విష్ణు అవును అని బదులిచ్చాడు.
తర్వాత మరో అభిమాని.. ఈ ఈవెంట్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాన్ (Power Star Pawan Kalyan) ను ఇన్వైట్ చేయొచ్చుగా అని అడిగారు. దీనికి హీరో ఇలా సమాధానమిచ్చాడు. పవన్ కల్యాణ్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాను అని అన్నారు. దీంతో అభిమానుల్లో మరింత హైప్ పెరుగుతోంది. మరీ పవర్ స్టార్ కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రానున్నాడా? లేదా? అని జనాల్లో ఎగ్జైటింగ్ మొదలైంది.






