- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannappa making video: కన్నప్ప మేకింగ్ వీడియో..బాబోయ్ ఇంత కష్టపడ్డారా?
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో కన్నప్ప సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో కన్నప్ప సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. కాగా ఈ వీడియో ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలోని చాలా సన్నివేశాలను రియల్ లొకేషన్స్‌లో తీసినట్టు కనిపిస్తోంది. విజువల్స్ చూడ్డానికి ఎంతో బాగున్నాయి. సినిమాను దాదాపు విదేశాల్లోనూ షూట్ చేసినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా సినిమా కోసం మంచు విష్ణు మాత్రమే కాకుండా ఇతర నటీనటులు సైతం ప్రాణం పెట్టి నటించినట్టు కనిపిస్తోంది.
గుర్రాలపై చేసే స్టంట్స్ కోసం చాలా కష్టపడినట్టు ఉంది. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం డిసప్పాయింట్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. కొన్ని సీన్లు షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్‌లా ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కన్నప్ప ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ముఖ్యమైన పాత్రలో నటించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాల స్టార్ మోహన్ లాల్ సైతం సినిమాలో నటించారు. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కన్నప్ప రీచ్ అవుతాడా లేదా చూడాలి.






