కేజీబీవీలో నైట్ వాచ్మెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

by Kodari Anjali |

మహమ్మదాబాద్ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నైట్ వాచ్మెన్ పోస్టును తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు మండల విద్యాధికారి ఎం. రాజు నాయక్ తెలిపారు

కేజీబీవీలో నైట్ వాచ్మెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..
X

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నైట్ వాచ్మెన్ పోస్టును తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు మండల విద్యాధికారి ఎం. రాజు నాయక్ తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల పరిధికి చెందిన మహిళా అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు స్థానిక కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నైట్ వాచ్మెన్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ కోరారు. నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు కేజీబీవీ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Next Story